: పట్టణ మహిళా?...బీ కేర్ ఫుల్... గుండెజబ్బు పొంచి ఉంది!
పట్టణాల్లో నివసించే 61 శాతం మంది మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఓ సర్వే తెలిపింది. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని సఫోలా లైఫ్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. భారత్ లోని వివిధ పట్టణాల్లో నివసించే 35 నుంచి 40 ఏళ్ల లోపు మహిళలపై ఈ సర్వే నిర్వహించినట్టు సఫోలా సంస్థ తెలిపింది. మారుతున్న జీవన విధానం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వంటి సమస్యల కారణంగా దేశంలోని పట్టణాల్లో జీవించే మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తద్వారా పట్టణాల్లో నివసించే 61 శాతం మంది మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. శారీరక వ్యాయామం తక్కువగా ఉండడం, హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు కూడా గుండెపోటు రావడానికి మరో కారణాలుగా మారాయని సర్వే తెలిపింది. ఆహారపుటలవాట్లు, వ్యాయామం, ఆహారం తీసుకునే సమయాలపై శ్రద్ధ చూపితే మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని సర్వే అభిప్రాయపడింది.