: తెలంగాణలో పోలీసు నియామకాల ఉద్యోగాలకు పరీక్ష ఫీజు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష ఫీజు ఖరారైంది. దరఖాస్తు చేసే అభ్యర్థులందరి నుంచి రుసుము తీసుకోవాలని పోలీసు నియామక సంస్థ నిర్ణయించింది. ఎస్ఐ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250, కానిస్టేబుల్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200లుగా పరీక్ష ఫీజును ఖరారు చేయడం జరిగింది. ఇలా వచ్చే ఫీజును నియామక ప్రక్రియలకు అయ్యే ఖర్చు కోసం వినియోగిస్తామని నియామక సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.