: ఎర్రబెల్లికి బెయిల్ మంజూరు
టీటీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావుకు బెయిల్ మంజూరైంది. జనగామలో నిన్న సాయంత్రం చోటుచేసుకున్న రాళ్లదాడి సందర్భంగా ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్లపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో విచారించిన న్యాయస్థానం ఎర్రబెల్లిని 14 రోజుల రిమాండ్ కి ఆదేశించింది. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఎర్రబెల్లి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, విచారించిన మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.