: మోదీ వస్తున్నారు, స్లీవ్ లెస్ లు, పొట్టి దుస్తులు వద్దు... ఉద్యోగులకు ఫేస్ బుక్ సలహా... విమర్శల సమయం మొదలు!
"భారత ప్రధాని నరేంద్ర మోదీ మన కార్యాలయానికి వస్తున్నారు. క్యాజువల్స్ ఎవరూ ధరించవద్దు. ఫార్మల్స్ ధరించండి. మహిళలు స్లీవ్ లెస్, పొట్టి దుస్తులు ధరించవద్దు. 'నైస్ డ్రస్' ధరించి రండి" అని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఉద్యోగులకు చెప్పారట. మోదీ పర్యటన ముగిసిన తరువాత మార్క్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ క్యాజువల్ వేర్ ఇష్టపడుతూ, వివిధ రకాల టీషర్టులు, జీన్స్ ధరిస్తూ కనిపించే జుకర్ బర్గ్ సైతం మోదీతో సమావేశానికి డ్రస్ కోడ్ పాటిస్తూ సూట్ ధరించి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు ఎటువంటి డ్రస్ కోడ్ ధరించి రావాలన్న విషయమై ఆయన సలహాలు ఇవ్వడం బాగాలేదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇంతటితో పోతుందా? లేక సామాజిక మాధ్యమాల పుణ్యమాని ప్రపంచమంతా పాకుతుందా? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.