: తెలంగాణలో జిల్లాల, డివిజన్ల, మండలాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ


తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారని ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెట్ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీకి వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కమిటీ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది.

  • Loading...

More Telugu News