: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఏపీ మంత్రులు కామినేని, పీతల... చింతమనేని కూడా!


మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. తాజాగా నిన్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఏపీ మంత్రులిద్దరితో పాటు ప్రభుత్వ విప్, జడ్పీ చైర్మన్ తదితరులంతా ఒకే లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. వివరాల్లోకెళితే... ఏలూరులో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లాకు చెందిన మహిళా మంత్రి పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజులను మూడో అంతస్తుకు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు లిఫ్ట్ ఎక్కించారు. అయితే లిఫ్ట్ మూడో ఫ్లోర్ చేరుకోకముందే రెండు అంతస్తుల మధ్య నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులతో పాటు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టెక్నీషియన్ వచ్చి క్షణాల్లో మరమ్మతు చేసేశాడు. దీంతో పది నిమిషాల తర్వాత మంత్రులతోపాటు అంతా సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News