: ముంబై సంస్థకు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన బాధ్యతలు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహణ బాధ్యతను ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ కైవసం చేసుకుంది. ఈ మేరకు ఏపీ సీఆర్ డీఏ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో రూ.9.5 కోట్లకు సదరు సంస్థ బాధ్యతలు దక్కించుకుంది. అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని ఈ నెల 16న సీఆర్ డీఏ టెండర్లు ఆహ్వానించింది.

  • Loading...

More Telugu News