: ‘సుప్రీం’ తలుపు తడతాం... ఫిరాయింపులపై ఎర్రబెల్లి కామెంట్


తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వేగంగా స్పందించారు. తమ పార్టీ టికెట్లపై విజయం సాధించి, టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న తమ వినతిపై స్పీకర్ స్పందించని కారణంగా టీ టీడీపీ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. అయితే స్పీకర్ పరిధిలో ఉన్న విషయంపై తాను స్పందించలేనని హైకోర్టు కొద్దిసేపటి క్రితం పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ఎర్రబెల్లి వేగంగా స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ పదవులకు రాజీనామా చేసే దాకా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News