: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త... అక్టోబరులో 20 లక్షల మందికి చెల్లింపులు


అగ్రి గోల్డ్‌ బాధితులకు శుభవార్త. సంస్థలో తక్కువ మొత్తాలను పెట్టుబడిగా పెట్టిన వారి నుంచి మొదలు పెట్టిన మధ్య తరగతి బాధితుల్లో 20 లక్షల మందికి త్వరలో చెల్లింపులు జరగనున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలోనే తొలి విడత చెల్లింపులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు అనుమతితో తొలి విడతలో దాదాపు రూ.1200 నుంచి రూ.1400 కోట్ల ఆస్తులను వేలం వేయనున్నట్టు ఏపీ సీఐడీ అదనపు డీఐజీ తిరుమలరావు వివరించారు. రూ. 1200 కోట్ల వరకు ముఖ విలువ ఉన్న వీటిని విక్రయిస్తే, రూ. 2 వేల కోట్ల వరకూ వస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. వెబ్‌ సైట్‌ లో డిపాజిటర్ల పేర్లను నమోదు చేస్తామని, తొలుత చిన్న డిపాజిటర్లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మొత్తం డిపాజిటర్ల సంఖ్య 32 లక్షల వరకూ ఉందని, ముఖ విలువ ప్రకారం ఆస్తుల విలువ రూ. 7,500 కోట్లుగా ఉందని, ఆస్తుల అమ్మకంపై నిర్ధారణకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని, నేడో, రేపో మధ్యంతర ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్నామని వివరించారు. ఆ వెంటనే వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News