: నిమజ్జనానికి వెళ్తుండగా ఆటో బోల్తా: ఒకరి మృతి


వినాయక నిమజ్జనానికి వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కాకినాడ సముద్ర తీరంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఆటోలో భక్తులు వెళుతుండగా సామర్లకోట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News