: తెలంగాణలో అత్యధిక ధర పలికింది ఈ లడ్డూకే!
తెలంగాణ రాష్ట్రంలో గణనాథుల లడ్డూలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడి మరీ వేలం పాటల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి గణనాథుడి లడ్డూకు అత్యధిక ధర పలికింది. కూకట్ పల్లి అడ్డగుట్ట సొసైటీలో నిర్వహించిన వేలం పాటలో చంటిరెడ్డి అనే భక్తుడు గణనాథుని లడ్డూను రూ.15 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు గణనాథుని లడ్డూ వేలంలో పలికిన ఎక్కువ ధర ఇదే అని చెప్పుకోవచ్చు!