: ట్యాంక్ బండ్ వద్ద మృతదేహం... భయాందోళనలో ప్రజలు
హైదరాబాదు, ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ఒక క్రేన్ వద్ద మృతదేహం లభ్యమైంది. క్రేన్ నెంబర్ 20 వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అసలు అక్కడికి మృతదేహం ఎలా వచ్చిందనే విషయం అర్థం కావట్లేదు. ఉదయం నుంచే ఆ మృతదేహం అక్కడ ఉందా? ఒకవేళ అక్కడే ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.