: తాజ్ మహల్ సందర్శనకు ఈ రోజు 30,000 మంది పర్యాటకులు


ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నూతన పర్యాటక భవనానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు శంకుస్థాపన చేశారు. నూతన భవనానికి ‘పర్యటక్ భవన్’గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు మాట్లాడారు. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్ సహా 200 ప్రముఖ మ్యూజియంలను సందర్శించే ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ఈ రోజు సుమారు 30,000 మంది సందర్శకులు తాజ్ మహల్ ను సందర్శించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మహేష్ శర్మ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News