: ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు: యువనటుడు అక్కినేని అఖిల్


అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ హీరో అఖిల్ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదల చేశారు. తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు గురించిన విశేషాలను ఇందులో వివరించారు. ఆ రోజు ఏ రోజై ఉంటుందనుకుంటున్నారు!.. అది ‘అఖిల్’ తొలి చిత్రం ఆడియో విడుదల జరిగిన రోజేనట. ఆరోజున అక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడటం అదే మొదటిసారని చెప్పాడు. అభిమానుల ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసి భావోద్వేగానికి గురయ్యానని, ఆ రోజు కోసమే తాను ఎదురు చూశానని తన మనసులో మాట చెప్పాడు అఖిల్. మరో విషయం...ఈ సందర్భంగా అభిమానులకు, ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబుకి అఖిల్ ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News