: సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ దాడులు
సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ తొలిసారిగా వైమానిక దాడులు ప్రారంభించింది. గత 15 రోజులుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన ఫ్రాన్స్ దళాలు ఈ దాడులకు దిగాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. స్థానిక భాగస్వాములతో కలిసి ఫ్రాన్స్ ఈ సమరం కొనసాగిస్తోంది. గతంలో ఫ్రాన్స్ బలగాలు ఇరాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాయి. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారి దాడులకు దిగుతున్నామని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.