: బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు మద్దతు పలికిన హార్దిక్ పటేల్


త్వరలో బీహార్ లో జరిగే ఎన్నికల్లో జనతాదళ్ యునైటెట్ నేత నితీష్ కుమార్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్టు పటేళ్ల నేత హార్దిక్ పటేల్ తెలిపారు. "ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎంతో చేశారు, మా వర్గానికే చెందిన మంచి నేత" అని వ్యాఖ్యానించిన హార్దిక్, ఈ ఎన్నికల్లో నితీష్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. బీహార్ లో బీజేపీ కూటమితో పోలిస్తే జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ల మహా కూటమి బలంగా కనిపిస్తోందని అన్నారు. 'కర్మ మహోత్సవ్' కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్ షడ్పూర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల కోసం తాము సాగిస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకముందని తెలిపారు.

  • Loading...

More Telugu News