: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుందో గూగుల్ మ్యాప్ పై చూడొచ్చు!


రైళ్లు ప్రయాణిస్తున్న సమయాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ, రైలు ఎక్కడ ఉందో కచ్చితంగా తెలిపే మరో వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని కోసం కొత్త స్టార్టప్ కంపెనీ 'రైల్ యాత్రి డాట్ ఇన్' జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఆధారిత యాప్ ను తయారు చేసింది. 'రైల్ రాడార్ జీపీఎస్' పేరిట లభిస్తున్న ఈ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్ పై రైలు ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకోవచ్చని 'రైల్ యాత్రి' ఒక ప్రకటనలో తెలిపింది. రైల్లో ప్రయాణిస్తున్న స్మార్ట్ ఫోన్ల నుంచి స్థాన సంకేతాలను విశ్లేషిస్తూ, రైలు ఎక్కడుందో చెప్పగలమని తెలిపింది. అత్యధిక ప్రయాణికులు రైలు ఎంతదూరంలో ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారని, అందువల్లే ఈ యాప్ కు రూపకల్పన చేశామని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News