: తనకు ప్రాణహాని ఉందంటోన్న ఎమ్మెల్యే కుమార్తె


తననెవరూ కిడ్నాప్ చేయలేదని నేడు గుంటూరు లీగల్ సర్వీసెస్ అథారిటీ మెట్లెక్కిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కుమార్తె రమ్య తనకు ప్రాణహాని ఉందంటోంది. ఈరోజు మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అని పేర్కొంది. అందుకే, తనకు భద్రత కల్పించాలని కోర్టును కోరానని, న్యాయస్థానం అందుకు సమ్మతించిందని రమ్య తెలిపింది. తన భర్తను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News