: కొన్ని పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి!: రసమయి బాలకిషన్
తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. కరీంనగర్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికలు రైతు ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అదే వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరి తీసిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికల రాతలు ఉండాలని ఆయన సూచించారు. ‘పిక్క కొడితే కరీంనగర్ జిల్లా కలెక్టర్ ను అవుతాను’ అని బాలకిషన్ అన్నారు. పీహెచ్ డి కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కోటాలో తాను సీటు సంపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.