: పిల్లల నుంచి చాలా నేర్చుకోవచ్చు: అమితాబ్
చిన్న పిల్లల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. ముంబైలో ఓ సిటీ స్కూల్ కు వెళ్లి అక్కడి పిల్లలతో గడిపారు. అనంతరం ఆయన తన బ్లాగులో వారితో గడిపిన అనుభవాలను రాశారు. కల్మషం లేని వారితో గడిపితే సమయమే తెలియలేదని ఆయన పేర్కొన్నారు. పిల్లలు చాలా అమాయకంగా, నిజాయతీగా ఉంటారని ఆయన తెలిపారు. వారిలో ఎలాంటి సంశయాలు, భయాలు ఉండవని, ఏదనిపిస్తే అది మాట్లాడేస్తారని ఆయన ముచ్చటపడ్డారు. వారి నుంచి చాలా నేర్చుకోవాలని ఆయన తెలిపారు.