: బీహార్ లో సీట్ల కేటాయింపులు న్యాయబద్ధంగానే జరిగాయి: రాజ్ నాథ్ సింగ్
బీహార్ లో అసెంబ్లీ టికెట్లను బీజేపీ అమ్ముకుంటోందంటూ ఆ పార్టీ ఎంపీ ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొట్టిపారేశారు. ఎంపీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు అసత్యమని మండిపడ్డారు. లక్నోలో ఓ కార్యక్రమానికి వచ్చిన రాజ్ నాథ్ వద్ద సొంత పార్టీపై సింగ్ చేసిన విమర్శలను ఓ విలేఖరి ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన హోంమంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే ప్రజల మద్దతుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.