: తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్ల వేతనాలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల వేతనాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ జీతాలు పెంచుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2010 వేతన సవరణ సిఫారసులకు అనుగుణంగా ఎస్జీటీలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్ లకు రూ.14,800 వేతనం ఇవ్వాలని ఖరారు చేశారు. వేతనాల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా 18,092 మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. వేతనాల పెంపు వల్ల అదనంగా రూ.27.22 కోట్ల వ్యయం ప్రభుత్వంపై పడనుంది.