: మక్కా తొక్కిసలాటలో మరణించిన భారతీయులు 18 మంది


సౌదీ అరేబియాలోని మక్కాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 18 మంది భారతీయులు చనిపోయినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ ఉదయం వెల్లడించారు. మరో 13 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ పరిశీలిస్తూ మృతుల వివరాలు తెలుసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన ఈ తొక్కిసలాటలో ఇంతవరకు దాదాపు 719 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News