: ఏపీ డీజీపీ రాముడికి మాతృవియోగం


ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ (87) ఈ ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చనిపోయారు. గోవిందమ్మ భౌతికకాయాన్ని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని ఆమె స్వగ్రామం నార్సింగ్ పల్లికి తరలించనున్నారు. అక్కడే రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. డీజీపీ తల్లి మరణవార్త తెలిసిన సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News