: చంద్రబాబు ప్రకటనల్లో నిజముందా?... పట్టిసీమతో ‘సీమ’కు లాభం లేదన్న పురంధేశ్వరి


పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పుకుంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు బీజేపీ నేత, ఆయన సమీప బంధువు దగ్గుబాటి పురంధేశ్వరి షాకిచ్చారు. చంద్రబాబు ప్రకటనల్లో నిజముందా? అంటూ ఆమె ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఏమాత్రం ప్రయోజనం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. నిన్న చిత్తూరులో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన ఆమె, కేవలం మూడేళ్లు మాత్రమే అందుబాటులో ఉండే పట్టిసీమపై చంద్రబాబు ప్రభుత్వం హడావిడి చేస్తోందని ఆరోపించారు. పోలవరం పూర్తయితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అవగాహన ఉన్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.450 కోట్లు విడుదల చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ రెండు శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆమె నిందలేశారు.

  • Loading...

More Telugu News