: సౌదీ ఘటనపై పోప్ సంతాపం


ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలోని మీనా వద్ద సంభవించిన దుర్ఘటనలో 717 మంది మృతి చెందడంపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. కాగా, ఆరు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన పోప్, ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఈ సందర్భంగా శరణార్థులను పెద్దమనసుతో ఆదుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. నిరాడంబరుడైన పోప్ ను కలిసేందుకు ఓ బాలిక చేసిన ప్రయత్నానికి విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. శరణార్థులకు సరైన గుర్తింపు కల్పించి, వారిలోని అభద్రతా భావాన్ని పారద్రోలాలని ఆమె చేసిన విజ్ఞప్తి మేరకు, ఆ బాధ్యతను ఆయన అమెరికా మీద ఉంచిన సంగతి విదితమే!

  • Loading...

More Telugu News