: అమెరికాలో కూడా ఫోన్ బిల్లులు షాకిస్తున్నాయి!


మనదేశంలోని పలు నగరాల్లో కరెంటు బిల్లు లక్షల్లో రావడం గురించి మనం వింటూనే ఉంటాం. కానీ, సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న అమెరికాలో కూడా ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటాయని ఈ సంఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే... ఓరిగాన్ స్టేట్ లోని డమాస్కస్ కు చెందిన కెన్ స్లషర్ దంపతులు గతేడాది నవంబర్ లో ఓ ప్రముఖ టెలిఫోన్ కంపెనీకి చెందిన రెండు ఫోన్లకు కనెక్షన్లు తీసుకున్నారు. మొదటి నెల బిల్లు 120 డాలర్లు రావాల్సి ఉండగా, 698 డాలర్లు వచ్చింది. దీంతో ఆ కంపెనీ సేవలు సరిగా లేవని భావించి, ఈ ఏడు జనవరిలో వాటిని వెనక్కి ఇచ్చేశారు. రెండో నెల ఫోన్ వాడకపోయినా 9 డాలర్ల బిల్లు వచ్చింది. దీంతో తొమ్మిది నెలలపాటు కస్టమర్ కేర్ చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. దీంతో బ్యాలెన్స్ చెక్ చేద్దామని భావించిన స్లషర్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయగా....2,156,593 డాలర్లు (14 కోట్లు) చెల్లించాలంటూ వాయిస్ ఆపరేటర్ చెప్పాడు. దీంతో స్లషర్ షాక్ తిన్నాడు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యాన్ని కలవడంతో సాంకేతిక తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని, దానిని వెంటనే సరిచేస్తామని అతనికి సర్దిచెప్పిపంపించారట.

  • Loading...

More Telugu News