: పాట్నా, ఆగ్రాలలో మహా దారుణం... అమ్మాయిల బహిరంగ వేలం!


బీహార్ కు చెందిన 14 ఏళ్ల బాలికను బహిరంగ వేలంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు కొనుగోలు చేశాడు. అతని బారి నుంచి ఆ బాలిక తప్పించుకుని బయటపడేందుకు ఓ ఎన్జీవో సంస్థ సహకరించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక పోలీసులకు చెప్పిన వివరాలు... "పాట్నా, ఆగ్రాలలో అమ్మాయిలను బహిరంగంగానే వేలం వేస్తున్నారు. నాతో పాటు మరో ఐదుగురు అమ్మాయిలను కూడా వేలం వేశారు. మూడు నెలల క్రితం పాట్నాలోని ఒక స్థలంలో నాతో సహా ఆరుగురు బాలికలను పెళ్లి కూతుళ్ల పేరుతో వేలానికి పెట్టారు. పంజాబ్ లోని అబోహర్ పట్టణానికి చెందిన రాజేష్ అనే యువకుడు రూ.88 వేలకు నన్ను కొనుగోలు చేశాడు. అందుకు రఘువీర్ అనే మరో యువకుడు రాజేష్ కు సహాయపడ్డాడు. అయితే, ఆగ్రాలోని మరో అంగట్లో ఎక్కువ రేటుకు నన్ను విక్రయించేందుకు రాజేష్ ప్రయత్నించాడు. నేను పెద్దగా అందంగా లేకపోవడంతో, నన్ను కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నన్ను పంజాబ్ కు తీసుకువెళ్లిపోయి అక్కడ ఓ ఇంట్లో బంధించాడు. తిండీతిప్పలూ లేకుండా మూడు నెలల పాటు నన్ను చిత్రహింసలు పెట్టాడు. ఆ హింసలు తట్టుకోలేక ఓ రోజు కేకలు పెడుతూ పెద్దగా ఏడ్చాను. నా కేకలు విన్న పొరుగింటివారు, సేవా నారాయణ్ సేవా సొసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు" అంటూ ఆ బాలిక పేర్కొంది.

  • Loading...

More Telugu News