: బెదిరింపులకు దిగిన పాక్ క్రికెట్ బోర్డు


డిసెంబర్ లో యూఏఈతో మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా పీసీబీని ఆర్థికంగా బలోపేతం చేసుకుందామని ఆలోచించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పప్పులుడకకపోవడంతో బెదిరింపులకు దిగింది. డిసెంబర్ లో జరగాల్సిన సిరీస్ కు బీసీసీఐ అంగీకరించని పక్షంలో టీమిండియాతో ఇక భవిష్యత్ లో కూడా ఆడమని స్పష్టం చేసింది. పాక్ తో సిరీస్ విషయమై భారత క్రీడామంత్రిత్వ శాఖను బీసీసీఐ అనుమతి కోరని పక్షంలో తాము కూడా దూరంగా ఉంటామని పేర్కొంది. ఆగస్టు 28న బీసీసీఐకి ఒక లేఖ రాశామని, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం బీసీసీఐపైనే ఉందని పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చెప్పారు. డిసెంబర్ సిరీస్ కు రాలేమని బీసీసీఐ చెబితే భవిష్యత్ లో భారత్ తో ఎలాంటి మ్యాచ్ లు ఆడమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News