: వరంగల్ ఎన్ కౌంటర్ కు సర్కార్ దే బాధ్యత: వరవరరావు
వరంగల్ ఎన్ కౌంటర్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మావోయిస్టు శృతిని హతమార్చడం దారుణమని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మావోయిస్టులను, వారి సానుభూతిపరులను అణచివేస్తున్నారని, వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మావోల అజెండాను అమలు చేస్తామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వరవరరావు మండిపడ్డారు.