: బాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ భండారి మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ భండారి కన్నుమూశారు. కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన గత రాత్రి మరణించారు. మంగళ్ పాండే, పహేలి, ప్రతిఘాత్, బవండర్ తదితర చిత్రాల్లో భండారి నటించారు. అంతేగాక గుమ్రాహ్, జీవన్ మృత్యు, పరంపర, కర్జ్, మిలే సుర్ మేరా తుమ్హారా వంటి టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా 1980ల్లో ఆయన ఎన్నో టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండేవారు. 1994 తరువాత టీవీ పరిశ్రమ నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మోహన్ కొడుకు ధ్రువం భండారీ కూడా ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.