: చెన్నై 'బిర్యానీ' ప్రియులను బెంబేలెత్తిస్తున్న వార్త


చెన్నైలోని యువకులు, చిరుద్యోగులు, కార్మికులు తమ భోజనావసరాలు తీర్చుకునేందుకు రోడ్ల పక్కన వుండే చిన్న హోటళ్లు, మొబైల్ వ్యాన్లు, భోజనం పాయింట్లపై ఆధారపడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరా చేసుకుని చిన్నతరహా క్యాంటీన్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో ఎక్కువగా అమ్ముడయ్యేది బిర్యానీ అని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం 50 రూపాయలకే ఈ బిర్యానీ లభించడంతో దీనిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా తక్కువ ధరకు లభించే బిర్యానీలో చికెన్ ముక్కలు లేదా మటన్ ముక్కలు ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, 'పిల్లి' మాంసంతో వండిన బిర్యానీని ఇలా తక్కువ రేటుకి అమ్మేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారట. ఈ విషయాన్ని చెన్నై పోలీసులే చెబుతున్నారు. ఈ విషయం ఎలా బయటపడిందంటే... ఈ మధ్య చెన్నైలో పిల్లులు కనిపించడం లేదంటూ ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, సంచార జాతులకు చెందిన కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లులను పట్టుకుని ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా, హోటళ్లకు విక్రయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఒక పిల్లిని పట్టుకుంటే హోటళ్ల యజమానులు 30 రూపాయలు ఇస్తారని వారు తెలిపారు. వీటిని ఏం చేస్తారని పోలీసులు అడగగా, బిర్యానీ వండి, తక్కువ రేటుకి కస్టమర్లకు అమ్ముతున్నారని వారు తెలిపారు. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇలాంటి హోటళ్లపై దాడులు చేయాలని ఆరోగ్యశాఖను వారు కోరారు.

  • Loading...

More Telugu News