: ఢిల్లీలో త్వరలో శ్రీవారి వైభవం... మోదీ కూడా వస్తారు: చదలవాడ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంలో ఉద్యోగులు, సిబ్బంది కీలకంగా వ్యవహరించారని తెలిపారు. త్వరలో ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర వైభవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ కూడా పాల్గొంటారని చదలవాడ వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణ కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిందన్నారు. దేవస్థానంలో మొత్తం సంస్కరణలు చేపట్టి అక్రమాలను అరికడతామని పేర్కొన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కృషితో కృష్ణా నదిలోకి గోదావరి జలాలు వచ్చాయని, దాంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అన్నారు.