: జగన్ కు పేరొస్తుందని బాబు భయపడుతున్నారు: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయడం సబబు కాదని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రత్యేక హోదావస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అప్పిరెడ్డి మండిపడ్డారు.