: ప్రపంచ చరిత్రలో అత్యద్భుతం, తలలో రాకెట్ శకలాలతో జన్మించిన పాప... నిజంగా మృత్యుంజయురాలే!


ప్రపంచ చరిత్రలో అద్భుతం జరిగింది. సిరియాలో జరుగుతున్న మారణహోమం గాయాల నుంచి, వైద్యులనే ఆశ్చర్యానికి గురి చేస్తూ, కడుపులో ఉన్న ఓ బిడ్డ భూమిపై ప్రాణాలతో పడింది. ఈ ఘటన అలెప్పోలోని ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓ రాకెట్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అమీరా అనే యువతి గర్భవతి. ఆమె గర్భాశయంలోకి రాకెట్ శకలాలు దూసుకెళ్లాయి. ఆసుపత్రికి తీసుకెళితే, స్కానింగ్ చేసిన డాక్టర్లు కడుపులో ఉన్న పాప తలలో పదునైన శకలాలు ఉన్నాయని తేల్చారు. ప్రాణం లేని బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వుందని తెప్పారు. తీరా ఆపరేషన్ చేశాక ఆ పాప ప్రాణాలతోనే ఉండటం చూసి వైద్యులు నివ్వెరపోయారు. తలలో రాకెట్ శకలాన్ని బయటకు తీశారు. ఇప్పుడా పాప కోలుకుంది. "ఆమె పుట్టకముందే ఉగ్రవాదులకు లక్ష్యమైంది. తీవ్రగాయాలతో జన్మించి ప్రపంచానికి సరికొత్త భవిష్యత్తును చూపింది. ఆమె ఫ్యూచర్ సైతం ఉజ్వలంగా ఉంటుందని ఆశిస్తున్నాం" అని ఆపరేషన్ చేసిన డాక్టర్ మొహమ్మద్ తబ్బా, న్యూస్ ఏజన్సీ 'సీఎన్ఎన్'కి తెలిపారు. 18వ తేదీన ఈ రాకెట్ దాడి జరిగిందని, ఆ తరువాత ఆపరేషన్ చేశామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News