: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?: బొత్స
ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ పని ముఖ్యమంత్రి చేయకపోవడం వల్లే... తమ అధినేత జగన్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేత చేస్తుంటే, సహకరించాల్సింది పోయి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా, తమ దీక్ష జరిగి తీరుతుందని అన్నారు. గుంటూరులోని ఏసీ కాలేజ్ ఎదుట ఉన్న స్థలంతో ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జిబిషన్ లను నిర్వహించారని... అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు.