: పట్టిసీమలో తెలంగాణకూ వాటా ఇవ్వాల్సిందే!... గోదావరి బోర్డు ఆదేశాలపై ఏపీ అంతర్మథనం


గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ నిన్న జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ సర్కారుకు ఆశనిపాతంగానే పరిణమించాయి. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు గోదావరి మిగులు జలాల్లో (మొత్తం 80 టీఎంసీలు) ఏపీ వాటా 45 టీఎంసీలు కాగా కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు చెందాల్సి ఉంది. ఇది రాష్ట్ర విభజనకు ముందు వచ్చిన తీర్పు. తాజాగా ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలలో తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందేనని నిన్న గోదావరి నదీ జలాల బోర్డు ఏపీకి లేఖ రాసింది. అయితే తెలంగాణకు ఏ మేరకు వాటా ఇవ్వాలో మీరే చెప్పండంటూ ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసేందుకు సమాయత్తమవుతోంది. అంతేకాక గోదావరి నదిపై పోలవరం, పట్టిసీమలే కాక తెలంగాణ పరిధిలోనూ పలు ప్రాజెక్టులున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని ప్రాజెక్టుల్లో తమకూ వాటా కేటాయించాలని కూడా ఏపీ బోర్డుకు కౌంటర్ లేఖ రాయనున్నట్లు సమాచారం. పట్టిసీమ నీళ్లను తెలంగాణకు ఇప్పించినప్పుడు, తెలంగాణలోని ప్రాజెక్టుల్లో తమ వాటా మాటేమిటని కూడా ఏపీ కాస్తంత ఘాటుగానే స్పందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం మున్ముందు మరింత వివాదాస్పదమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News