: మక్కా ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 717


ముస్లిముల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా సమీపంలోని మీనా వద్ద జరిగిన తొక్కిస లాటలో 717 మందికిపైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనలో 850 మందికి పైగా గాయాలపాలయ్యారని స్థానిక వార్తాపత్రికలు తెలిపాయి. కాగా, ఈ సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. మీనా ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 13 మంది భారతీయ యాత్రికులు మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. వారిలో హైదరాబాదులోని ఎల్బీనగర్ కు చెందిన షేక్ బీబీజాన్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, గాయపడ్డ భారతీయుల సంఖ్య తెలియలేదు. తెలుగు రాష్ట్రాలు హజ్ యాత్రికుల కోసం రెండు రాష్ట్రాలు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశాయి. అధికారులు సౌదీలోని భారతీయ ఎంబసీతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News