: తెలివి మీరిన వ్యాపారులు... మేకలకు సినిమా తారల పేర్లు!
వ్యాపారం పచ్చగా ఉండాలంటే వినూత్నంగా ఆలోచించాలి. అదే సూత్రాన్ని పాటించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన మేకల వ్యాపారులు వాటికి సినిమా స్టార్ల పేర్లు పెట్టి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ముస్లింలు పవిత్రంగా ఆచరించే బక్రీద్ సందర్భంగా మేకల వ్యాపారులు జమ్నాపురి, డుంబా, అజ్మెరీ జాతికి చెందిన మేకలకు సల్మాన్, షారూఖ్, సానియాల పేర్లు పెట్టారు. వీటి ధరను 15000 రూపాయల నుంచి లక్ష రూపాయలుగా నిర్ణయించారు. వీటికి డిమాండ్ అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. యూపీలోని నక్కాస్ లోని ఓల్డ్ సిటీకి చెందిన సాజిద్ అనే వ్యాపారి 125 కేజీల మేకకు 'బర్ఫీ' అని పేరుపెట్టి అమ్మకానికి పెట్టాడు. తమ మేకలు ఆరోగ్యంగా కనిపించేందుకు బాదం, తేనె, ఆకుకూరలు పెట్టి పోషిస్తామని వారు తెలిపారు.