: క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ


క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితుడయ్యాడు. ప్రస్తుతం క్యాబ్ జాయింట్ సెక్రటరీగా ఉన్న గంగూలీని అధ్యక్షుడిగా నియమించాలంటూ క్యాబ్ సభ్యులు ప్రతిపాదించారు. గంగూలీ స్థానంలో జగ్ మోహన్ దాల్మియా కుమారుడు అభిషేక్ దాల్మియాను క్యాబ్ జాయింట్ సెక్రటరీగా నియమించాలని కోరారు. వీరి నియామకానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలికారు. దీంతో వీరి నియామకం లాంఛనంగా మారింది. కాగా, బీసీసీఐపై తనదైన ముద్ర వేసేందుకు గంగూలీ ఇదో గోల్డెన్ ఛాన్స్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాల్మియా వర్గానికి గంగూలీ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. బీసీసీఐలో దాల్మియా వర్గం, శ్రీనివాసన్ వర్గాలదే పైచేయిగా ఉండేది. వర్గాలుగా ఎవరు ప్రభావితం చూపితే వారినే అత్యున్నత పదవులు వరిస్తాయన్న విషయం గతంలో నిరూపితమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News