: ఒకేచోట కనువిందు చేసిన 2500 'కృత్రిమ చందమామ'లు!
పున్నమి వెన్నెల్లో నిండు చందమామ అందమే వేరు...అలాంటి చందమామలు 2500 ఒకే చోట కొలువుదీరితే...వాహ్...ఆ దృశ్యాన్ని వర్ణించడానికి భాష సరిపోదు. అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. యాంగ్జౌ నగరం నెలకొల్పి 2500 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఆ నగరంలోని సెంట్రల్ స్క్వేర్ లో 2500 చందమామలను తలపించే విధంగా లూనార్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఇవి అచ్చం చందమామల్లా ఉండడంతో భారీ సంఖ్యలో సందర్శకులు వీటిని వీక్షిస్తున్నారు. చిమ్మ చీకట్లో ఇవి చందమామలను తలపిస్తుండడంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇన్ని కృత్రిమ చందమామలను ఒకే చోట ఏర్పాటు చేసినందుకు గాను వీరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.