: 9 పల్టీలు కొడుతూ 'హారర్ క్రాష్', మృత్యువుకు హ్యాండిచ్చిన 17 ఏళ్ల లక్కీ ఫెలో... మీరూ చూడండి!


ఈ కారు ప్రమాదాన్ని తిలకించిన వాళ్లెవరూ, అందులోని డ్రైవర్ అతి స్వల్ప గాయాలతో బయటపడ్డాడంటే నమ్మరు. మృత్యువుకు అతి దగ్గరగా వెళ్లి, 'హాయ్, బై' చెప్పొచ్చిన ఈ 17 ఏళ్ల యువ రేసర్, ఫార్ములా వన్ మాజీ చాంపియన్ నెల్సన్ పికెట్ కుమారుడు పెడ్రో. బ్రెజిల్ లోని గోయియానాలో జరిగిన పోర్ష్ జీటీ3 కప్ లో ఈ ఘటన జరిగింది. తాను నడుపుతున్న కారు మరో కారును ఢీకొని అదుపు తప్పి గాల్లో బంతిలా ఎగిరి 9 పల్టీలు కొట్టింది. ఈ దృశ్యాన్ని పలు యాంగిల్స్ నుంచి ఎన్నో హై రెజల్యూషన్ కెమెరాలు చిత్రీకరించాయి. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ పెడ్రోను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రి బెడ్ పై ఉండి, తనకు తాను తీసుకున్న సెల్ఫీని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన పెడ్రో, తాను బతుకుతానని భావించలేదని చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News