: అమోల్ పాలేకర్ 'మ్యానిపులేట్' అంటూ, ఆస్కార్ జ్యూరీకి గుడ్ బై చెప్పిన రాహుల్ రవైల్


మరాఠీ చిత్రం 'కోర్ట్'... ఈ సంవత్సరం భారత్ తరఫున ఆస్కార్ బరిలో 'బెస్ట్ ఫారిన్ ఫిల్మ్' కేటగిరీలో పోటీ పడేందుకు ఎంపికైన తరువాత జ్యూరీలో సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాను జ్యూరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాహుల్ రవైల్ వెల్లడించారు. అమోల్ పాలేకర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ, జ్యూరీ నిర్ణయాలను ఆయన తారుమారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. "భారతీయ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలిసిన గొప్పగొప్పవారు జ్యూరీలో భాగంగా ఉండటం మనకెంతో గర్వకారణం. అయితే, ఇక్కడ నిర్ణయాలను తారుమారు చేయగల సామర్థ్యమున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు అమోల్ పాలేకర్" అని రాహుల్ వ్యాఖ్యానించారు. మొత్తం 17 మంది సభ్యులున్న జ్యూరీ టీమ్ కు పాలేకర్ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News