: స్వామి దయానంద గిరికి రజనీకాంత్ నివాళులు
ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరికి సినీ నటుడు రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో "పూజ్య శ్రీస్వామి దయానంద గారు... మేము మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం. మీ పాదలకు మా ప్రణామాలు చేస్తున్నాం. దయచేసి ఎల్లప్పుడూ మాతోనే ఉండండి" అంటూ రజనీ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దయానంద గత రాత్రి కన్నుమూశారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.