: జగన్ బెయిల్ పిటిషన్ విచారణ తేదీ మార్పు
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ పై తొలుత ఈనెల 30న విచారణ జరపాలని భావించిన సుప్రీం కోర్టు ఆనక తన నిర్ణయాన్ని మార్చుకుంది. అదే రోజున నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయి రెడ్డి పిటిషన్లపైనా విచారణ జరపాల్సి ఉండడంతో, జగన్ పిటిషన్ ను ఒకరోజు ముందే విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 29కి జగన్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తూ తాజా ఉత్తర్వులిచ్చింది.
మూడు కేసులు ఒకేసారి విచారణ జరిపితే ఒకదాని తీర్పు ప్రభావం మరొక దానిపై పడుతుందని జగన్ న్యాయవాదులు వెలిబుచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను ఈనెల 29న చేపట్టాలని నిర్ణయించింది.