: సీన్ రివర్స్... నిరసన తెలపాలనుకున్న వారి నుంచి మోదీకి ఘనస్వాగతం


ప్రధాని హోదాలో అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకోవాలని భావించిన ఎన్నారై పటేళ్ల వర్గం, తమ ఆలోచనలను విరమించుకుని, ఆయనకు ఘనస్వాగతం పలికింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వచ్చిన మోదీ అక్కడి వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్ లో బస చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న నిరసనలకు మద్దతుగా, ఈ హోటల్ ముందు తలపెట్టిన ప్రదర్శనను గుజరాత్ ఎన్నారై పటేళ్లు విరమించుకున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వారంతా మోదీకి స్వాగతం పలికారు. కాగా, నేడు, రేపు అమెరికన్ కంపెనీల సీఈఓలతో బిజీగా గడపనున్న మోదీ, శనివారం నాడు వెస్ట్ కోస్ట్ కు వెళ్లేముందు జర్మనీ చాన్స్ లర్ అంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ తదితరులతో సమావేశమై చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News