: మాయావతికి షాకిచ్చిన ఈడీ...బీఎస్పీ నేతకు చెందిన రూ.200 కోట్ల ఆస్తులు జప్తు
ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసిన హెల్త్ స్కాంలో సీబీఐ దర్యాప్తుకు సంబంధించి మొన్న ఆగ్రహం వ్యక్తం చేసిన బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న షాకిచ్చింది. బీఎస్పీ నేత, యూపీ మాజీ మంత్రి బాబుసింగ్ కుశ్వాహాకు చెందిన రూ.200 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ నిన్న నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.10 వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని వార్తలు వస్తున్న యూపీ హెల్త్ స్కాం దోషులను వదిలేది లేదని ఈడీ తేల్చిచెప్పింది. ఈడీ జప్తు చేసిన కుశ్వాహా ఆస్తుల్లో యూపీలోనివే కాక, ఢిల్లీలోని ఓ వాణిజ్య సముదాయం కూడా ఉందట.