: అపోలో జూనియర్ డాక్టర్ మిస్సింగ్
హైదరాబాదులోని కూకట్ పల్లిలో మిస్సింగ్ కలకలం రేపుతోంది. హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వర్తించే నాగదుర్గాదేవి విధులకు హాజరైన అనంతరం ఇంటికి చేరుకోలేదని ఆమె బంధువులు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బంధువులు, స్నేహితులు, ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. వీలైనంత త్వరగా కేసును పరిష్కరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.