: అత్యాచారం, ఆపై హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
ఓ బాలికపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడిన కేసులో ఇద్దరికి ఉరిశిక్షతో పాటు జరిమానా కూడా విధించిన సంఘటన త్రిపురలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో ఉత్తర త్రిపురలోని కమల్ పూర్ అడిషినల్ సెషన్స్ జడ్జి అరిందమ్ పాల్ ఈ తీర్పును ఇచ్చారు. కేసు పూర్వాపరాలు ఈవిధంగా ఉన్నాయి. గత ఏడాది, గిరిజన యువకులు రషీద త్రిపుర (25), జాని త్రిపుర(20) కలసి పన్నెండు సంవత్సరాల గిరిజన బాలికను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు.