: బ్యాంకింగ్ అండ... లాభాల్లో ముగిసిన మార్కెట్లు
బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇవాల్టి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు పుంజుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 171 పాయింట్లు పెరిగి 25,823కు ఎగబాకింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 7,846కు చేరుకుంది. ఇవాల్టి టాప్ గెయినర్స్... జై ప్రకాష్ అసోసియేట్స్ (11.92%), ఐడీబీఐ బ్యాంక్ (9.27%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (8.22%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (7.25%), గుజరాత్ పిపవావ్ పోర్ట్ (6.54%). టాప్ లూజర్స్... సన్ రైజ్ ఏషియన్ (-4.92%), భారతి ఇన్ ఫ్రా టెల్ (-4.88%), పీఎంసీ ఫిన్ కార్ప్ (-4.27%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-4.05%), ఎన్ఎండీసీ (-3.96%).